
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వి కపూర్ హీరోయిన్. బుచ్చిబాబు సానా దర్శకుడు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన విలేజ్ సెట్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.
ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ మ్యాసీవ్ విలేజ్ సెట్‌ని నిర్మించారు. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, కొంత టాకీ పోర్షన్‌ని చిత్రీకరించబోతున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఆన్ లొకేషన్ ఫొటోస్‌లో హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబుతో పాటు విలన్‌గా నటిస్తున్న దివ్యేందు శర్మ ఉన్నారు.
ఇప్పటికే ముప్ఫై శాతం వరకూ షూటింగ్ పూర్తికాగా, ఈ షెడ్యూల్‌తో సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. సినిమాలోని రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా ప్రేక్షకులకు ఓ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నామని, ఈ లెంగ్తీ షెడ్యూల్ సినిమాకు ఎంతో కీలకమని చెబుతున్నారు మేకర్స్. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండగా ఆర్. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఇందులో రామ్ చరణ్ ఆట కూలిగా నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల కానుంది.