చంద్రబాబును సమర్థించే వాళ్లు ఈ 12 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: వర్మ

చంద్రబాబును సమర్థించే వాళ్లు ఈ 12 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: వర్మ

వివాదాస్పద కామెంట్స్  తో నిత్యం వార్తలో ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్లో  టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి  కామెంట్స్ చేశారు. ఒక లివింగ్ టుగెదర్ జంట ఎట్టకేలకు పెళ్లిని ప్రకటించిందని.. తాను ఏ సందర్భంలో ఇలా చెప్పానో చెప్పగలరా  అంటూ ప్రశ్నించారు. 

ALSO READ: భట్టి విక్రమార్క దళిత దొర : లింగాల కమల్​రాజు

అంతేగాకుండా స్కిల్ డెవ్ లప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును సమర్థించే వాళ్లు తాను అడిగే  12 ప్రశ్నలకు సమాధానం అవునా కాదా? వన్ వర్డ్ తో  సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. ఒక వేళ  ఈ 12 ప్రశ్నలకు స్పందించకపోతే అన్ని ప్రశ్నలకి అవునని సమాధానం చెప్పినట్టేనని ట్వీట్ చేశారు.  వర్మ అడిగిన ఈ ప్రశ్నలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


చంద్రబాబును మర్ధించే వాళ్ళెవరైనా ఈ 12   క్యోచ్ఛేన్స్ కి వన్ వర్డ్ లొ ఆవునా? కాదా ? అనే ఫార్మాట్ లో సమాదానమిస్తారా ? 

1. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుపై చేసుకున్న ఒప్పందం బోగస్. ‌.. ... అవునా ? 

2. ఈ ఫేక్‌ ఒప్పందం తోనే రూ 300 కోట్లు పైగా  ఇచేసారు .. .. అవునా ? 

3. ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం నుంచి ఈ డబ్బు విడుదల చేయడానికి అన్ని రూల్స్‌ను ఉల్లంఘించారు . డబ్బు విడుదలకోసం అధికారుల అబ్జెక్షషన్స్ పెడచెవిన పెట్టారు. ..అవునా ? 

4. తమకు ఎలాంటి డబ్బు ముట్టలేదని, అసలు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ,సీమెన్స్‌ కంపెనీ లిఖిత పూర్వకంగా చెప్పింది …అవునా ? 

5. 90శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చే ఎలాంటి స్కీం తమ వద్దలేదని సీమెన్స్‌ చెప్పింది  …. అవునా ? 

6. ఈమేరకు సెక్షన్‌ 164 CRPC కింద జడ్జి ఎదుట ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాధికారులు, సీమెన్స్‌ అధికారులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు  …అవునా ? 

7. విడుదల చేసిన ఆ డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాల్సిన భాద్యత  ప్రభుత్వానికి వుంది ... అవునా ? 

8. ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో  కనిపెట్టాల్సిన భాద్యత  ప్రభుత్వానికి వుంది . …అవునా ? 

9. రూ. 300 కోట్లకుపైగా డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా, మధ్యవర్తుల ద్వారా మళ్లించారు. ….అవునా ? 

10. స్కిల్‌ కేసులో ED దర్యాప్తుచేసి నలుగురిని అరెస్టుచేసి ఆ విషయాన్ని ED తన అక్కౌంట్‌ ద్వారా ట్వీట్‌ చేసింది  . అధికారికంగా పత్రికా ప్రకటన విడుదలచేసింది .. ఇప్పుడు మీ అభియోగం  సెంట్రల్ ఏజెన్సీ అయిన ED ఈ విషయంలో రాజకీయ ప్రతీకారానికి దిగిందని అంటున్నారు … అవునా ? 

11. విజయవాడలోని ACB కోర్టు దాదాపు 10 గంటలసేపు ఇరుపక్షాల వాదనలు విని  ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావించే చంద్రబాబుకు రిమాండ్‌  విధించింది  … అవునా ? 

12. ఇళ్లనిర్మాణం విషయంలో డబ్బు చంద్రబాబుగారి చేతిలోకి వెళ్లిందనే విషయాన్ని ఐటీ నోటీసుల ద్వారా ఎలా వెలుగులోకి వచ్చిందో , అలాగే స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాంలో అనేక షెల్‌ కంపెనీలు, నిందితులైన యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ్‌ పార్దసాని తదితరుల ద్వారా ఆయన మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్‌కు, అక్కడ నుంచి ఆయనకు చేరిందని  ED  చెప్తోంది. …అవునా ?

ఒక వేళ కాదంటే పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు పారిపోయినట్టు ?

ఈ 12 ప్రశ్నలకు స్పందించకపోతే  అన్ని ప్రశ్నలకి అవునని సమాధానమిచినట్టే!