గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తా :  రామ్మోహన్ రెడ్డి ప్రమాణం

గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తా :  రామ్మోహన్ రెడ్డి ప్రమాణం

పరిగి, వెలుగు  :  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్​లను అమలు చేస్తామని పరిగిలోని శివాలయం లో కాంగ్రెస్ అభ్యర్థి టి. రామ్మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.   గెలిపిస్తే పరిగి ప్రజలకు ఇచ్చిన హామీలను  నెరవేరుస్తానని హామీల అఫిడవిట్ పై సంతకం చేసి ఇచ్చారు.

నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా.. అవినీతికి చోటివ్వకుండా పని చేస్తానని హామీ ఇస్తున్నా’.. అని ఆయన బాండ్ లోని అంశాలను చదివి వినిపించారు. ఏఐసీసీ ఇన్ చార్జ్ లు ఎంపీ విష్ణుప్రసాద్, కర్ణాటక ఎమ్మెల్సీ అరవింద్, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు.