మోదీ, రఘునందన్ రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు

మోదీ, రఘునందన్ రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు

నర్సాపూర్, వెలుగు: హైదరాబాద్ మెదక్ నేషనల్ హైవే 765డీ 63 కిలోమీటర్లు నాలుగు లైన్లుగా చేయడాన్ని హర్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ రఘునందన్ రావు ఫ్లెక్సీకి బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఎంపీగా గెలిచిన ఏడాది కాలంలోనే రోడ్ల విస్తరణ కోసం కృషి చేయడం, సోలార్ లైట్లు ఏర్పాటు చేసినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి అంబులెన్స్ మంజూరు చేయించారని పేర్కొన్నారు. 

ఎంపీ కృషితో  మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్​లో చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ గౌడ్, పెద్ద రమేశ్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, కార్యదర్శి సురేశ్, మాజీ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మండల అధ్యక్షుడు నగేశ్, చంద్రయ్య, రాజేందర్, బుచ్చేశ్ యాదవ్ పాల్గొన్నారు.