
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ లేకపోయి ఉంటే భారతదేశ చిత్రపటం ఇలా ఉండేది కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భారత మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా… ఢిల్లీలో ఆయన సమాధి దగ్గర రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, అమిత్ షాలు నివాళులర్పించారు. స్వతంత్ర్యం తర్వాత 550 గణరాజ్యాలను పటేల్ …భారత్ లో కలిపేశారని చెప్పారు. ఇండియన్ యూనియన్ ను తయారు చేసేందుకు పటేల్ అవిశ్రాంతంగా పనిచేశారని తెలిపారు. జమ్మూకశ్మీర్ ను ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aలు దేశంలో ఉగ్రవాదుల ఎంట్రీకి గేట్ వే లా పనిచేశాయని చెప్పారు అమిత్ షా. ఆ గేట్ వేకు … గేట్ బంద్ చేసిన ఘనత ప్రధాని మోడీదే అన్నారు. తర్వాత సర్ధార్ పటేల్ స్మారకార్థం ప్రతీ ఏటా నిర్వహిస్తోన్న రన్ ఫర్ యూనిటీని జెండా ఊపి ప్రారంభించారు అమిత్ షా.