వందకు చేరిన రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ సైట్లు.. అగ్రస్థానంలో నిలిచిన భారత్..

 వందకు చేరిన రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ సైట్లు.. అగ్రస్థానంలో నిలిచిన భారత్..


మానవ తప్పిదాలు, మితిమీరిన ఆధునీకరణ వల్ల భూమిపై ఉన్న అత్యంత విలువైన సహజ వనరులైన చిత్తడి నేలలు  వేగంగా అంతరించిపోతున్నాయి. సరస్సులు, నదులు, డెల్టాలు, బురద నేలలు, తీర ప్రాంతాలతో కూడిన ఈ పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చిత్తడి నేలల పరిరక్షణ కోసం కుదిరిన ఒకే ఒక్క చారిత్రాత్మక రక్షణ కవచం రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ ఒప్పందం.

నేపథ్యం
ఇరాన్ దేశంలోని రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ అనే నగరం వేదికగా 1971,  ఫిబ్రవరి 2న ఈ అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం కుదిరింది. అందుకే దీనికి రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ ఒప్పందం అని పేరు వచ్చింది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. 1975, డిసెంబర్ 21 నుంచి ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా అమలులోకి రాగా.. భారతదేశం 1982, ఫిబ్రవరి 1న ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసింది.

ప్రధాన లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలలు అంతరించిపోకుండా కాపాడటం, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా వాటిని వివేకంతో ఉపయోగించుకోవడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఒప్పందం కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలను రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ సైట్లుగా గుర్తించి, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.

ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే వీటిని భూమి మూత్రపిండాలు అని పిలుస్తారు.

వరదల నియంత్రణ: ఇవి స్పాంజ్​లాగా పనిచేస్తూ అదనపు నీటిని పీల్చుకుని వరద తీవ్రతను తగ్గిస్తాయి.

భూగర్భ జలాలు: ఎండిపోతున్న భూగర్భ జల మట్టాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

జీవవైవిధ్యం: వందలాది జాతుల మొక్కలు, జంతువులు ముఖ్యంగా ఖండాలు దాటి వచ్చే విదేశీ వలస పక్షులకు ఇవి సురక్షిత ఆవాసాలుగా నిలుస్తాయి.

కార్బన్ నియంత్రణ: వాతావరణంలోని హానికరమైన కార్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్రహించి, గ్లోబల్ వార్మింగ్ పెరగకుండా పర్యావరణాన్ని కాపాడతాయి.

ఆసియాలో అత్యధిక రామ్​సర్ సైట్లు
దేశంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ సైట్ల సంఖ్య అధికారికంగా 100కు చేరుకుంది. దీంతో ఆసియా ఖండంలోనే అత్యధిక రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ సైట్లు కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

తమిళనాడు టాప్
దేశంలో అత్యధికంగా రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు (20 సైట్లు) మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (13), పంజాబ్ (6), ఒడిశా (6), బిహార్ (6) రాష్ట్రాలు ఉన్నాయి. 

దేశంలో తొలి ఐదు సైట్లు 
భారతదేశం 1982, ఫిబ్రవరి 1న అధికారికంగా ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే, 1981లోనే దేశంలో తొలి సైట్లను గుర్తించారు.
1. చిల్కా సరస్సు (ఒడిశా - 1981, అక్టోబరు 1): ఇది భారతదేశంలోనే మొదటి రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ సైట్. దేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
2. కియోలాడియో జాతీయ పార్కు (రాజస్థాన్ - 1981, అక్టోబరు 1): చిల్కాతోపాటే గుర్తింపు పొందింది. సైబీరియన్ క్రేన్స్ వంటి విదేశీ వలస పక్షులకు ఇది ప్రపంచ ప్రసిద్ధి.
3. ఊలార్ సరస్సు (జమ్మూకాశ్మీర్, 1990, మార్చి 23): దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటి. జీలమ్ నది దీని గుండా ప్రవహిస్తుంది.
4. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తక్ సరస్సు (మణిపూర్ - 1990, మార్చి 23): నీటిపై తేలియాడే ద్వీపాలకు (ఫుమ్డిస్) ప్రసిద్ధి. ఇక్కడే ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ పార్కు కైబుల్ లామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జావో ఉన్నది.
5. హరికే సరస్సు (పంజాబ్ - 1990, మార్చి 23): సట్లెజ్, బియాస్ నదుల కలయిక వద్ద ఏర్పడిన ఒక అద్భుతమైన మానవ నిర్మిత చిత్తడి నేల.

96. యశ్వంత్ సాగర్ (మధ్యప్రదేశ్): ఇండోర్ సమీపంలో ఉన్న ఈ జలాశయం, అంతరించిపోతున్న సారస్ క్రేన్ పక్షులకు మధ్య భారతదేశంలోనే అతి ముఖ్యమైన నివాసం.
97. అన్సుపా సరస్సు (ఒడిశా): మహానది పక్కన ఉన్న ఇది ఒడిశాలోనే అతిపెద్ద గుర్రపు నాడా ఆకారపు మంచినీటి సరస్సు.
98. హీరాకుడ్ రిజర్వాయర్ (ఒడిశా): దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మిత జలాశయాల్లో ఒకటి. అపారమైన జీవవైవిధ్యానికి ఇది నిలయం.
99. తాంప్ర సరస్సు (ఒడిశా): ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న అత్యంత అందమైన మంచి నీటి సరస్సు. పర్యావరణ సమతుల్యతకు ఎంతో కీలకమైనది.
100. జై ప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం (సురహా తాల్ - ఉత్తరప్రదేశ్): 2026, జూన్ 5న అధికారికంగా ప్రకటించిన ఈ సహజసిద్ధమైన మంచి నీటి సరస్సు భారతదేశపు చారిత్రాత్మక 100వ రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్ సైట్​గా రికార్డులకెక్కింది.

– వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్