
నేను చాలా బాగున్నాను.. జెనీవాలో ఉన్నాను.. త్వరలోనే ఇండియా వస్తున్నాను.. బెంగళూరుకి వస్తున్నాను.. ఇంతకీ నేను చచ్చానని చెప్పిన వెధవ ఎవడ్రా మీకు అంటూ అసహనం వ్యక్తం చేశారు నటి, రాజకీయ వేత్త దివ్య స్పందన అలియాస్ రమ్య. కాంగ్రెస్ రాజకీయ నేతగా.. సినిమా నటిగా కర్ణాటకలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓసారి ఎంపీగా కూడా గెలిచారు. మంచి పాపులర్ అయిన రమ్య.. చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. సినిమా పీఆర్వోలు రిప్ అంటూ కామెంట్స్ చేస్తే.. తమిళనాడుకు చెందిన కొన్ని టీవీ ఛానెల్స్ సైతం రమ్య గుండెపోటుతో చనిపోయిందంటూ వార్తలు ప్రసారం చేశాయి.
Also Read : సనాతన దుర్మార్గపు వైఖరి మారాలి.. స్టాలిన్కు మద్దతుగా పా. రంజిత్
ఈ వార్తలపై రమ్యతో సన్నిహితంగా ఉండే జర్నలిస్టు స్పందించారు. ఆమె చనిపోలేదంటూ వివరణ ఇచ్చారు. ఈ సమయంలోనే.. ఓ జాతీయ మీడియాకు రమ్య తన వాయిస్ ఇచ్చారు. ఇంతకీ నేను చచ్చిపోయానని వాళ్లకు చెప్పిన వెధవ ఎవడ్రా అంటూ కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను.. త్వరలోనే బెంగళూరు వస్తున్నాను.. మిగతా విషయాలు ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం అంటూ వివరణ ఇచ్చారు.
It was really the strangest conversation, kept calling @divyaspandana and she didnt pick first few times and naturally I was panicking. Finally she did and I had to say-I am glad you are alive, She is like who the hell is saying I died! #DivyaSpandana
— Dhanya Rajendran (@dhanyarajendran) September 6, 2023
వ్యక్తిగత పనులపై జెనీవాలో ఉన్నానని స్పష్టం చేశారామె. నాకు తెలియకుండానే నేను ఎలా చనిపోతానో ఇప్పుడే తెలిసిందని.. ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వాళ్లకు బుద్ది లేదంటూ అసహనం వ్యక్తం చేశారామె.