Ramzan Food : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మటన్ బిర్యానీ తయారీ.. రుచికి రస్తా.. ఈ కోఫ్తా

Ramzan Food : ఇంట్లోనే రెస్టారెంట్ స్టయిల్ మటన్ బిర్యానీ తయారీ.. రుచికి రస్తా.. ఈ కోఫ్తా

ప్రతిరోజు అన్నం, చపాతీల్లో పచ్చళ్లు, కూరలకు బదులు స్పెషల్ కర్రీస్ తింటే బాగుంటుంది కదా! అందుకే ఖాళీగా ఉన్నప్పుడో.. సెలవు రోజుల్లోనే వంటింట్లో ఓ గంట సేపు కష్టపడితే కొత్త కొత్త రుచులు తినొచ్చు. అలాంటి వాటిల్లో స్పెషల్ 'కోఫ్తా'. ఈ కర్రీ అన్నంలో, రోటీలో కూడా సూపర్బ్. దీంతో పాటు ఒక ఉల్లిపాయ ముక్క, రెండు పచ్చిమిర్చి కొరికితే ఆ రుచే వేరు. అలాంటి కోఫ్తా కర్రీలే ఇవి..

మటన్ బిర్యానీ

కావాల్సినవి
బాస్మతి రైస్: నాలుగు కప్పులు,

గరం మసాలా : ఒక టేబుల్ స్పూన్,

లవంగాలు: ఐదు,

యాలకలు: ఐదు,

షాజీర: ఒక టేబుల్ స్పూన్,

దాల్చిన చెక్క: ఒకటి,

కుంకుమ పువ్వు: కొంచెం (పాలలో నానబెట్టాలి),

ఉప్పు : రుచికి సరిపడా..

ముందుగా బియ్యంను రెండు, మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత లోతుగా ఉన్న పాన్లో నీళ్లు పోసి మరిగించా లి. అందులో గరం మసాలా పొడి, బియ్యం, ఉప్పు వేసి ఉడికించాలి. ముప్పావు వంతు బియ్యం ఉడికిన తర్వాత నీళ్లు తీసేయాలి.

కోఫ్తా కోసం..

మటన్ ఖీమా : 500 గ్రాములు,

ఉల్లిపాయ తరుగు : ఒక కప్పు,

గరంమసాలా: ఒక టేబుల్ స్పూన్,

ఉప్పు: రుచికి సరిపడా,

గసగసాలు: ఒక టేబుల్ స్పూన్,

అల్లం పేస్ట్: ఒక టేబుల్ స్పూన్,

వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్,

ఫ్రెష్ క్రీమ్: ఒక టేబుల్ స్పూన్,

కారం: ఒక టేబుల్ స్పూన్,

కొబ్బరి తురుము: ఒక టేబుల్ స్పూన్,

కొత్తిమీర తరుగు: ఒక కప్పు,

శెనగపిండి : ఒక టేబుల్ స్పూన్,

మిగిలిన పదార్థాలను మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమన్ని మటన్ భీమాలో కలిపి నలభై నిమిషాలు ఫ్రిజ్లో పెట్టాలి.తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేయాలి.

కర్రీ తయారీకి... 

నూనె : అర కప్పు,

పచ్చిమిర్చి: రెండు,

ఉల్లిపాయ తరుగు: ఒకటి,

టొమోటో గుజ్జు: ఒక కప్పు,

అల్లం పేస్ట్: ఒక టేబుల్ స్పూన్,

వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్,

జీలకర్ర: అర టేబుల్ స్పూన్,

పసుపు: కొంచెం,

పెరుగు: మూడు టేబుల్ స్పూన్లు,

గరం మసాలా : అర టేబుల్ స్పూన్,

కారం: రెండు టేబుల్ స్పూన్లు,

ఉప్పు: రుచికి సరిపడా,

పుదీనా తరుము : ఒక కప్పు,

ఎల్లో ఫుడ్ కలర్: కొంచెం,

యాలకలు పొడి: పావు టీ స్పూన్ 

ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి జీలకర్ర వేగించాలి. అందులో ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగించాలి. ఉల్లిపాయ గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత టొమాటో గుజ్జు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వేసి కలపాలి. అవరసరమైతే కొద్దిగా నీళ్లు కలపొచ్చు. స్టప్ని తగ్గించి.. మటన్ కోఫ్తాలు, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇరవై నిమిషాలు ఉచికించిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర తురుము వేసి కలపాలి.

బిర్యానీ ఇలా..

ఇలా లోతైన పాన్లో కొద్దిగా నెయ్యి రాసి ముందుగా రెడీ చేసుకున్న రైసిని కొంచెం వేసి పాన్ మొత్తంగా పరచాలి. దానిపై కోఫ్తా కర్రీని లేయర్గా సర్పాలి. దానిపై రైస్, కోఫ్తా లేయర్లుగా వేయాలి. చివరిగా పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలర్ వేయాలి. స్టన్ని సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉంచితే మటన్ కోఫ్తా బిర్యానీ రెడీ. రైతా లేదా గ్రీన్ సలాడ్తో ఈ బిర్యానీ సూపర్ గా ఉంటుంది.