నాకంత సీన్ లేదు: రానా

నాకంత సీన్ లేదు: రానా

రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన మూవీ గల్లీ బాయ్. తాజాగా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగులో రీమేక్‌ అయితే ఎవరు ఆఫ్ట్ అవుతారని ఓటింగ్ పెట్టింది.  ఇందులో ఆప్షన్ లుగా.. విజయ్ దేవరకొండ, రానా, అల్లు అర్జున్ లను ఆఫ్షన్ లుగా ఇచ్చారు. దీంతో తమకు నచ్చిన వారికి ఓట్లు వేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయంపై రానా స్పందించారు. ‘నన్ను వదిలేయండి.. నాకు అంత నైపుణ్యం లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. రానా సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అయ్యారు. రానా మీరు గొప్పనటుడు అంటూ కితాబిచ్చారు.

రిమేక్ హక్కులను నిర్మాత అల్లు అరవింద్ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. హిందిలో తెరకెక్కిన గల్లీబాయ్ సినిమాను జోయా అక్తర్ దర్శకత్వం వహించారు.