దుల్కర్ సల్మాన్, రానా, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్‌లో సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ ‘కాంత’. శుక్రవారం సినిమా రిలీజ్ సందర్భంగా ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించిన దుల్కర్, రానా సినిమా విశేషాల గురించి వివరించారు. రానా మాట్లాడుతూ ‘ప్రచారంలో ఉన్నట్టు ఇది ఎవరి (తమిళ సూపర్ స్టార్ ఎం.కె.త్యాగరాజ భాగవతార్) బయోపిక్ కాదు.. కంప్లీట్‌గా ఫిక్షనల్ స్టోరీ. ఇది ఎవరి తాతలు, నాన్నల కథ కాదు (నవ్వుతూ). బుధవారం చెన్నైలో సినిమా చూపిస్తున్నాం కనుక అన్ని క్లియర్ అవుతాయి. ఇలాంటి కథలు ఒకప్పుడు చాలా జరిగాయి. అలనాటి సినీరంగం నుంచి స్ఫూర్తి పొంది రాసిన కథ ఇది. ఇదొక ఇన్సిడెంట్ కాదు.. డార్క్ సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్. ఇద్దరు గొప్ప వ్యక్తులు వాళ్ళ ఆర్టిస్ట్ బ్రిలియన్స్ కోసం గొడవలు పడిన నేపథ్యంలో జరిగే కథ. టైమ్‌ను రీ క్రియేట్ చేయడం సినిమాకే సాధ్యం.
ఒకప్పుడు మద్రాస్‌లో ఉండే స్టూడియో కల్చర్‌ను ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేశాం. సినిమా మాకెంతో ఇచ్చింది. అలాంటి సినిమాకు తిరిగి ఇచ్చే అవకాశం మాకు ‘కాంత’తో వచ్చింది. ఇందులో నా క్యారెక్టర్ క్రేజీగా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది” అని చెప్పారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఇది చాలా స్పెషల్. ఇలాంటివి అరుదుగా వస్తాయి. రీ క్రియేట్ చేయలేం. అందుకే నేను, రానా కథ వినగానే కచ్చితంగా చేయాలనుకున్నాం. ‘మహానటి’ చిత్రంలోని పాత్రకు ఓ రిఫరెన్స్ ఉంది. కానీ ఇందులో ఎలాంటి రిఫరెన్స్ లేదు. ఎలా చేయాలనేది నేను, డైరెక్టర్ మాట్లాడుకున్నాం. ట్రైలర్‌లో చూసినట్టు ఒక మ్యాజిక్ క్రియేట్ అయింది. రానా, సముద్రఖని, భాగ్యశ్రీ అద్భుతమైన పెర్ఫార్మర్స్. ఇందులో ప్రతి క్యారెక్టర్‌కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ సినిమా మొదలైన పది నిమిషాల తర్వాత మీరు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. డ్రామా ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకులు థియేటర్స్‌లో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఫీల్ అవుతారు” అని చెప్పారు.
