రొమాన్స్‌కి రెడీ

రొమాన్స్‌కి రెడీ

విభిన్న పాత్రల్లో నటించడం.. పాత్రలకు తగ్గట్టుగా మేకోవర్ కావడం చూస్తేరానా ఎంత డిఫరెంట్గా ఉండటానికి ట్రై చేస్తాడో అరమ్థ వుతుంది. వెరైటీగా ఉంటుంది అనుకుంటే హీరోగానే కాదు, విలన్‌‌గా కూడా నటించడానికి  రెడీ అవుతాడు రానా. రీసెంట్ గా అడవిని కాపాడే వన్‌‌దేవ్‌‌గా ‘హాథీ మేరే సాథీ’లో ఒక విలక్షణ మైన పాత్రను పోషించాడు. తెలుగులో ‘అరణ్య’గా రావాల్సిన ఈ సినిమా లాక్‌‌డౌన్ కారణంగా పోస్ట్‌‌పోన్ అయ్యింది. మరోపక్క వేణు ఊడుగుల దర్శకత్వం లో ‘విరాటపర్వం ’ చేస్తున్నాడు. నిర్మాతగా కూడా కొన్ని కొత్త తరహా ప్రాజెక్టుల్ని చేపట్టి వాటి పనిలోనూ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే అతను ఓ రొమాంటిక్ లవ్‌‌స్టోరీలో నటించనున్నట్లు తెలిసింది. రీసెంట్‌గా సోషల్‌‌ మీడియాలో ఓ ప్రశ్నకి సమాధానం చెప్పే క్రమంలో రానాయే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. రానా కెరీర్‌‌‌‌ మొత్తాన్నీ పరిశీ లిస్తే అతను ఒకటో రెండో తప్ప లవ్‌‌స్టోరీలు చేయలేదు. అతని ఫిజిక్‌‌, లుక్స్‌‌ని బట్టి లవర్‌‌‌‌ బోయ్‌‌గా కంటే మ్యాన్‌‌లీగా ఉండే రోల్స్‌‌కే బాగా సూటవుతాడని చాలామంది భావిస్తుంటారు. మరి రొమాన్స్‌‌కి రెడీ అవుతున్న రానా ఆ పాత్రలో ఎలా ఉంటాడో చూడాలి. నటుడిగా వంక పెట్టే చాన్స్ ఇవ్వడు కాబట్టి అద్భుతంగా పండిస్తాడని మాత్రం ఫిక్సయి పోవచ్చు.