2027 జనవరిలో లవ్‌‌ అండ్‌‌ వార్

2027 జనవరిలో లవ్‌‌ అండ్‌‌ వార్

రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్‌‌ లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం  ‘లవ్  అండ్ వార్‌‌‌‌’.   సంజయ్ లీలా భన్సాలీ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాకు సంబంధించి రిలీజ్‌‌ డేట్‌‌ను గురువారం అనౌన్స్‌‌ చేశారు. వచ్చే ఏడాది జనవరి 21న  సినిమా థియేటర్స్‌‌కు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌‌లో రణబీర్ కపూర్‌‌‌‌... వింటేజ్ కారును ఒంటిచేతితో డ్రైవ్ చేస్తూ కనిపించాడు.  

మరో చేతికి గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉన్నాడు. ట్రయాంగిల్‌‌ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో అతను ఓ ఆర్మీ ఆఫీసర్‌‌‌‌గా నటిస్తున్నాడు. అలాగే ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌ ఆఫీసర్‌‌‌‌గా విక్కీ కౌశల్ కనిపించనున్నాడు.  దేశం కోసం పోరాడే ఈ ఇద్దరూ ఓ అమ్మాయి కోసం ఎలాంటి పోరాటం చేశారు అనేది ప్రధాన కథగా తెలుస్తోంది. రూ.350 కోట్ల బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

రియల్ లైఫ్‌‌ కపుల్‌‌ అయిన రణబీర్‌‌‌‌, అలియా.. ఏ దిల్‌‌ హై ముష్కిల్‌‌,  బ్రహ్మాస్త్ర చిత్రాల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ఇది.  ఇక  గతంలో భన్సాలీ తెరకెక్కించిన ‘సావరియా’లో రణబీర్‌‌‌‌ నటించగా.. అలియా ‘గంగూబాయి కతియావాడి’లో నటించిన విషయం తెలిసిందే. హిందీతో పాటు తెలుగు,  తమిళ భాషల్లోనూ ‘లవ్ అండ్ వార్‌‌‌‌’ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.