యానిమల్ చిత్రం నుంచి రణబీర్ ఫస్ట్ లుక్ రిలీజ్

యానిమల్ చిత్రం నుంచి రణబీర్ ఫస్ట్ లుక్ రిలీజ్


‘బ్రహ్మాస్త్ర’ పార్ట్‌‌‌‌1లో లవర్‌‌‌‌‌‌‌‌ బాయ్‌‌‌‌గా ఆకట్టుకున్న రణబీర్ కపూర్.. ‘యానిమల్‌‌‌‌’ చిత్రంలో  కంప్లీట్ యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.  కొత్త సంవత్సరం కానుకగా రణబీర్ ఫస్ట్‌‌‌‌లుక్‌‌‌‌ని విడుదల చేశారు మేకర్స్. ఇందులో మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌‌‌‌లో ఉన్నాడు రణబీర్. 

రక్తసిక్తమైన గొడ్డలిని  చంకలో పెట్టుకుని, సిగరెట్ వెలిగిస్తూ గ్యాంగ్‌‌‌‌స్టర్ లుక్‌‌‌‌లో  కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్డ్‌‌‌‌ గెటప్‌‌‌‌లో ఉన్న రణబీర్‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ మాసీవ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలాగే సినిమాపై ఎక్స్‌‌‌‌పెక్టేషన్స్ పెంచేలా ఉంది. రష్మిక హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్‌‌‌‌, భద్రకాళి పిక్చర్స్‌‌‌‌ బ్యానర్స్‌‌‌‌పై  భూషణ్‌‌‌‌కుమార్‌‌‌‌, ప్రణయ్ రెడ్డి వంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగష్టు 11న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.