రణదీప్ సింగ్ సూర్జేవాలా టంగ్ స్లిప్

రణదీప్ సింగ్ సూర్జేవాలా టంగ్ స్లిప్

కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న క్రమంలో టంగ్  స్లిప్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా.  మ‌హాభారతంలో ద్రౌప‌ది వ‌స్త్రాప‌హ‌ర‌ణాన్ని ప్రస్తావించబోయి పొర‌పాటున సీతాదేవి పేరును పలికారు.   కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవ‌స్ధల‌ను, ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను వంటి ద‌ర్యాప్తు ఏజెన్సీల‌ను నిర్వీర్యం చేస్తోంద‌ని చెబుతూ ఆయ‌న ఈ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ నైతికంగా  ఘోరంగా ఓడిపోయిందని  విమర్శలు చేసిన సుర్జీవాలా.. రాజ్యనభ ఎన్నికల్లో ఆ పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు.  ఈ క్రమంలో సీతాదేవి వ‌స్త్రాప‌హ‌ర‌ణం త‌ర‌హాలోనే బీజేపీ ప్రజాస్వామ్య విలువ‌లను ఊడ‌దీయాల‌ని కాషాయ పార్టీ కోరుకుంటోంద‌ని రణ్‌దీప్‌ దుయ్యబ‌ట్టారు.  వాస్తవానికి కౌరవ సభలో ఐదుగురు పాండవుల ముందు ద్రౌప‌ది వ‌స్త్రాప‌హ‌ర‌ణం గురించి ప్రస్తావించబోయి పొర‌పాటున సీతాదేవి పేరును పలికారు. సూర్జేవాలా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సుర్జేవాలా వ్యాఖ్యలను బీజేపీ విమర్శిస్తూ..  రాముడి ఉనికిని కాంగ్రెస్ కొట్టిపారేస్తోందని పేర్కొంది.