'నేను పుట్టిన ఊరూరా ఇది..పండగైనా,పాడైనా అంత ఇక్కడే'.. రంగబలి ట్రైలర్

'నేను పుట్టిన ఊరూరా ఇది..పండగైనా,పాడైనా అంత ఇక్కడే'.. రంగబలి ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) తాజా చిత్రం రంగబలి(Rangabali).  పవన్ బాసంశెట్టి (Pawan Basamsetti) అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ మూవీ పై నాగశౌర్య ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రెయిలర్ లో  'నేను పుట్టిన ఊరూరా ఇది..పండగైనా,పాడైనా అంత ఇక్కడే'.,'బయట ఊర్లో బానిసల బతికిన పర్లే భయ్యా..సొంత ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి' అని నాగశౌర్య  చెప్పే డైలాగ్స్  ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

నాగశౌర్య కు జోడీగా యుక్తి తరేజా(Yukti Thareja) నటిస్తుంది. దసరా మూవీలో విలన్ గా యాక్ట్ చేసిన షైన్ టామ్ చాకో(Shine Tom Chacko)  మరోసారి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు పవన్ సిహెచ్(Pawan Ch) మ్యూజిక్ ఇవ్వడం విశేషం.ఈ మూవీ SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri)  నిర్మిస్తున్నాడు. జూలై 7 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.