ప్రకాశ్ రాజ్ చెంప చెల్లుమనిపించిన బ్రహ్మానందం

ప్రకాశ్ రాజ్ చెంప చెల్లుమనిపించిన  బ్రహ్మానందం

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’ (Rangamarthanda). ఇది 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి రీమేక్. ప్రకాశ్‌ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారుల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది. ఈ నేపథ్యలంలో మేకర్స్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒక మ్యూజిక్ తో ఈ సినిమాలోని కీలక పాత్రలను ఈ టీజర్ లో చూపించారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం పాత్రలలోని ఎమోషన్ ను ఆవిష్కరించారు. ' రేయ్ .. నువ్వొక చెత్త నటుడివిరా .. మనిషిగా అంతకంటే నీచుడివి' అని ప్రకాశ్ రాజ్ ను బ్రహ్మానందం చెంప చెల్లుమనిపించడం ఈ టీజర్ కి హైలైట్. నేనొక నటుడిని అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ చూస్తుంటే మూవీ ఏ రెంజ్ లో ఉండబోతుంది అర్థమౌతుంది. టీజర్ సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇందులో సిరివెన్నెల రాసిన చివరి పాటను, ఇళయరాజా ఆలపించడం విశేషం.