పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం
  • రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి శశాంక

ఎల్ బీనగర్,వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చేవెళ్ల లోక్ సభ  నియోజకవర్గ రిటర్నింగ్అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో లోక్ సభ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియపై సమీక్షించారు. చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ శశాంక సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.

రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను అందజేయడంతో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో ఈసీ గైడ్ లైన్స్ కు అనుగుణంగా అభ్యర్థులకు గుర్తులు కేటాయించామని వివరించారు. బుధవారం ఐసీఐఎల్ నుంచి బ్యాలెట్ యూనిట్లు ఈవీఎం గోడౌన్ కు  చేర్చుతామని పేర్కొన్నారు.  ఎన్నికల విధుల్లో పాల్గొనే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు కూడా రెండో విడత శిక్షణ కొనసాగుతుందని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

కౌంటింగ్ కేంద్రంతో పాటు డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్ వద్ద పకడ్బందీ ఏర్పాటు చేశామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించేలా చర్యలు తీసుకున్నామని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, డీఆర్ వో సంగీత, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.