అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలోని తారామతిపేటలో రోడ్డు దాటుతున్న ఓ ఐదేండ్ల బాలుడిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తారామతిపేటకు చెందిన మేకల లింగస్వామి కొడుకు శ్రీకాంత్(5) ఆదివారం సాయంత్రం ఇంటి ఎదురుగా ఆడుకుంటూ మహంకాళి ఆలయం వెనుక రోడ్డు దాటుతున్నాడు. ఈ సమయంలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుంచి తారామతిపేట వైపు వస్తున్న కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో శ్రీకాంత్ తలకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
=
