హాలియా, వెలుగు : హాలియా పట్టణంలోని టైమ్స్ పాఠశాల ఆవరణలో గురువారం నిర్వహించిన 51వ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ పోటీల్లో రంగారెడ్డి జిల్లా బాలికల జట్టు విజేతగా నిలిచింది. మూడు రోజులపాటు ఆయా జిల్లాల జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలు హోరాహోరీగా తలపడ్డాయి.
ముగింపు రోజు సెమీఫైనల్స్ లో నల్గొండ, భద్రాద్రి ( కొత్తగూడెం) జిల్లా మధ్య జరిగిన పోటీల్లో నల్గొండ జట్టు విజయం సాధించగా, రంగారెడ్డి, ఖమ్మం జట్ల మధ్య జరిగిన పోటీల్లో రంగారెడ్డి జట్టు గెలిచింది. ఫైనల్ లో నల్గొండ, రంగారెడ్డి జట్ల మధ్య హోరాహోరీగా తలపడగా నల్గొండ జట్టు పై రంగారెడ్డి జట్టు 35, 33 పాయంట్లు తేడ తో గెలిచి విజేతగా నిలిచింది.
మొదటి బహుమతిని రంగారెడ్డి జట్టు, రెండో బహుమతిని నల్గొండ జట్లు, మూడవ, నాల్గొ బహుమతిలను భద్రాద్రి ( కొత్తగూడెం), ఖమ్మం జట్లు జాయిట్ విన్నర్ గా గెలుచుకున్నాయి. ముగింపు వేడుకల్లో విజేతలకు లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, హైదరాబాద్ డీఎస్పీ చవ్వా శంకర్ రెడ్డి ప్రైజులు అందజేశారు.
