కలిసే తాను.. వెలిగే నేను

కలిసే తాను.. వెలిగే నేను

నాగశౌర్య హీరోగా పవన్ బాసింశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగబలి’. యుక్తి తరేజా హీరోయిన్‌‌‌‌. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ సి.హెచ్.పవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే ఒక సాంగ్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సోమవారం ‘కల కంటూ ఉంటే’ అనే రెండో పాటను రిలీజ్ చేశారు.  ‘అందరిలోనూ ఒక్కడు కాను.. నేను వేరే తీరులే.. కలిసే తాను.. వెలిగే నేను.. మాయ నాలో జరిగేనే.. ఇదిగో వింతే.. మనసేమో ఆగదసలే..’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌‌‌‌లో శౌర్య, తరేజా మధ్య ఉన్న బాండింగ్‌‌‌‌ను చూపించారు. పవన్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ క్యాచీ లిరిక్స్ రాశాడు.  సార్థక్ కళ్యాణి, వైష్ పాడిన తీరు ఆకట్టుకుంది. కాలేజ్ స్టూడెంట్స్ గెటప్‌‌‌‌లో శౌర్య, తరేజా లుక్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. జులై 7న సినిమా రిలీజ్ కానుంది..