కామారెడ్డి కలెక్టరేట్ లో మహిళా ఎంప్లాయిస్ కు ముగ్గుల పోటీలు

కామారెడ్డి కలెక్టరేట్ లో మహిళా ఎంప్లాయిస్ కు ముగ్గుల పోటీలు

కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్​లో మంగళవారం టీఎన్జీవోస్​ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురష్కరించుకొని మహిళా ఎంప్లాయిస్​కు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్​ కలెక్టర్లు విక్టర్, మదన్​మోహన్​ ముఖ్య​అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. 

టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీలు నరాల వెంకట్​రెడ్డి, ముల్క నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, రాజ్యలక్ష్మీ, పోచయ్య, సంతోష్​కుమార్, రాజ్​కుమార్, లక్ష్మణ్, దత్తాద్రి, శ్రీనివాస్​రెడ్డి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.