
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో డెహ్రాడూన్-రిషికేష్ హైవేలోని జఖాన్ నది దగ్గర ఉన్న రాణి పొఖారి బ్రిడ్జి నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. బ్రిడ్జి కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న వాహనాలు నదిలో పడిపోయాయి. కొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. అయితే, వాహనల్లోని జనం.. ప్రమాదాన్ని ముందే తెలుసుకుని వాహానాల్లోంచి దిగి వంతెనపైకి చేరుకున్నారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
#WATCH | A bridge at Jakhan river on Ranipokhari-Rishikesh highway collapses in Dehradun, Uttarakhand
— ANI (@ANI) August 27, 2021
District Magistrate R Rajesh Kumar says traffic on the route has been halted. pic.twitter.com/0VyccMrUky