రూ.15 లక్షలకు ఎకరా చొప్పున కేసీఆర్ ఫాంహౌజ్ కొంటం: రుద్రమదేవి

రూ.15 లక్షలకు ఎకరా చొప్పున కేసీఆర్ ఫాంహౌజ్ కొంటం: రుద్రమదేవి

భూ నిర్వాసితుల నష్టపరిహారంపై మంత్రి హరీష్ రావుకు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కౌంటర్ ఇచ్చారు.  రూ.15 లక్షలకు ఎకరం చొప్పున కేసీఆర్ ఫాంహౌజ్ మొత్తం కొంటాం అమ్ముతారా అని ప్రశ్నించారు.  తెలంగాణలో దౌర్భాగ్యపాలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో 19 వేల మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.

కామారెడ్డిలో రైతు ఆంజనేయులు ఆత్మహత్య బాధాకరమన్న రాణి రుద్రమ..జులైలో పంటనష్టం జరిగితే ఇప్పటికీ పరిహారం అందలేదన్నారు. నేషనల్ క్రైం బ్యూరో లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5900లకు పైగా రైతులు  ఆత్మహత్య చేసుకున్నారన్నారు.