సత్యదేవ్ లీడ్‌గా దర్శకుడు వెంకటేశ్ మహా రూపొందిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. మహేష్‌బాబుకు సంబంధించిన జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆదివారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జూన్ 5న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో రాజసంగా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. సాంప్రదాయ దుస్తుల్లో, అధికారం, రహస్యభావం కలిసిన లుక్‌తో ఆయన ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది.
పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ప్యాలెస్, చుట్టూ అల్లుకున్న అడవి తీగలతోపాటు ‘అనుమానం పెనుభూతం’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. దీపా థామస్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
కథ, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ బాధ్యతలను స్వయంగా తీసుకున్న వెంకటేశ్ మహా తనదైన సెన్సిబిలిటీస్‌తో పాటు యూనివర్సల్ ఎమోషన్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు.

