గూని బాబ్జీగా రావు రమేష్

గూని బాబ్జీగా రావు రమేష్

విల‌‌‌‌‌‌‌‌క్ష‌‌‌‌‌‌‌‌ణ న‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌, త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌దైన డైలాగ్ డిక్ష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌తో క్యారెక్ట‌‌‌‌‌‌‌‌ర్ ఆర్టిస్టుగా ఓ ప్ర‌‌‌‌‌‌‌‌త్యేక స్థానాన్ని సంపాదించారు రావు ర‌‌‌‌‌‌‌‌మేష్. ద‌‌‌‌‌‌‌‌ర్శ‌‌‌‌‌‌‌‌కులు, ర‌‌‌‌‌‌‌‌చ‌‌‌‌‌‌‌‌యిత‌‌‌‌‌‌‌‌లు ఆయ‌‌‌‌‌‌‌‌న్ని దృష్టిలో ఉంచుకుని క్యారెక్ట‌‌‌‌‌‌‌‌ర్స్ క్రియేట్ చేసే స్థాయికి ఆయన ఎదిగారు. ప్రస్తుతం పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు రావు రమేష్. నిన్న ఆయన పుట్టినరోజు కావడంతో వాటి వివరాలను రివీల్ చేశాయి ఆయా టీమ్స్. శర్వానంద్, సిద్ధార్థ్‌‌‌‌‌‌‌‌ ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ‘మహాసముద్రం’లో గూని బాబ్జీ అనే పాత్రలో నటిస్తున్నారు రమేష్. ఆ విషయాన్ని చెబుతూ లుక్‌‌‌‌‌‌‌‌ని రిలీజ్ చేశారు. ఒక భుజాన్ని పైకెత్తి అచ్చంగా గూని ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారాయన. ఇక ప్యాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్ చాఫ్ట‌‌‌‌‌‌‌‌ర్ 2`లోనూ రమేష్‌‌‌‌‌‌‌‌ కోసం ఓ స్పెష‌‌‌‌‌‌‌‌ల్ రోల్‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశాడు ద‌‌‌‌‌‌‌‌ర్శ‌‌‌‌‌‌‌‌కుడు ప్ర‌‌‌‌‌‌‌‌శాంత్ నీల్. ఇందులో క‌‌‌‌‌‌‌‌న్నెగంటి రాఘ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌న్ అనే సీబీఐ ఆఫీస‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నారు రమేష్. న‌‌‌‌‌‌‌‌రాచి లైమ్‌‌‌‌‌‌‌‌స్టోన్ కో–ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ వెనుక దాగిన నిజాన్ని బ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌ట పెట్ట‌‌‌‌‌‌‌‌డంలో రాఘ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌న్ స‌‌‌‌‌‌‌‌క్సెస్ అవుతారా, సీబీఐ ఆస‌‌‌‌‌‌‌‌క్తి కేజీఎఫ్ పైనా లేక రాకీభాయ్ పైనా లాంటి ప్ర‌‌‌‌‌‌‌‌శ్న‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌తో ఆయన క్యారెక్ట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు సినిమా పైన కూడా ఇంటరెస్ట్ క్రియేట్ చేశారు. చాప్ట‌‌‌‌‌‌‌‌ర్ 1 ప్యాన్ ఇండియా వైడ్ హిట్ సాధించ‌‌‌‌‌‌‌‌డంతో సీక్వెల్‌‌‌‌‌‌‌‌లో టాలీవుడ్‌‌‌‌‌‌‌‌తో పాటు బాలీవుడ్ న‌‌‌‌‌‌‌‌టీన‌‌‌‌‌‌‌‌టుల‌‌‌‌‌‌‌‌ను కూడా తీసుకున్నారు.