యునిక్‌‌‌‌‌‌‌‌ విమెన్‌‌‌‌‌‌‌‌ ర్యాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రుబిని గోపీనాథ్

యునిక్‌‌‌‌‌‌‌‌ విమెన్‌‌‌‌‌‌‌‌ ర్యాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రుబిని గోపీనాథ్

ర్యాప్‌‌‌‌‌‌‌‌ పాటల మీదున్న ఇష్టం కాలేజీ కల్చరల్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ఆమెను ర్యాప్‌‌‌‌‌‌‌‌ పాట కట్టేలా చేసింది. ఆ పాట విన్నవాళ్లను నిల్చొని చప్పట్లు కొట్టేలా చేసింది. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేయించింది. ఇప్పుడు ఆమెని యునిక్‌‌‌‌‌‌‌‌ విమెన్‌‌‌‌‌‌‌‌ ర్యాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నలుగురికీ పరిచయం చేసింది. ఆమె పేరు రుబిని గోపీనాథ్.

చెన్నైలో ఉంటుంది రుబిని. చిన్నప్పటినుంచే పాటలు రాయాలని కలలు కనేది. పాడేది కూడా. చెన్నై ఎతిరాజ్‌‌‌‌‌‌‌‌ కాలేజిలో బిఏ టూరిజం, ట్రావెల్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోర్స్‌‌‌‌‌‌‌‌లో డిగ్రీ పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే ర్యాప్‌‌‌‌‌‌‌‌ పాటల మీద ఇష్టం పెంచుకుంది. అప్పుడే తమిళనాడు పాపులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెక్‌‌‌‌‌‌‌‌ గో (గోపీనాథ్‌‌‌‌‌‌‌‌)కి అభిమాని అయింది రుబిని. తరువాత తన ఫేవరేట్‌‌‌‌‌‌‌‌ రాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోపీనాథ్‌‌‌‌‌‌‌‌నే పెండ్లి చేసుకొని ‘మిస్సెస్‌‌‌‌‌‌‌‌ గో’ పేరుతో ర్యాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. దాని తరువాత వాళ్లిద్దరూ కలిసి చాలా పాటలు పాడారు.   

వద్దు ఆపేయమన్నారు
ఒక రోజు వాళ్ల కాలేజి కల్చరల్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో తనే సొంతంగా రాసిన ర్యాప్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ పాడతానంది. ‘ర్యాపా..? నువ్వు ఎలా పాడతావు? నలుగురు ఏం అనుకుంటారు? సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాళ్లు అస్సలు ఒప్పుకోరు. పాడొద్దు’ అని రుబిని ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ ఆమెను అడ్డుకున్నారు. వాళ్లను పట్టించుకోకుండా స్టేజ్‌‌‌‌‌‌‌‌ ఎక్కి తను రాసుకున్న ర్యాప్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ పాడేసింది. అది విన్నవాళ్లంతా చాలా బాగుందని నిల్చొని మరీ చప్పట్లు కొట్టారు. అప్పుడే ర్యాప్‌‌‌‌‌‌‌‌ను  ప్యాషన్‌‌‌‌‌‌‌‌గా మార్చుకుందామె. తరువాత 2018లో ‘తమిళ్‌‌‌‌‌‌‌‌ బ్లడ్జ్‌‌‌‌‌‌‌‌’ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ ఛానెల్‌‌‌‌‌‌‌‌వాళ్లు రుబినితో ‘ఎన్‌‌‌‌‌‌‌‌ కథై’ అనే ర్యాప్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌ పాడించి యూట్యూబ్‌‌‌‌‌‌‌‌లో రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అదే తను పాడిన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ సాంగ్‌‌‌‌‌‌‌‌.

 చీర కట్టు అందుకే... 
తన తల్లిదండ్రులకు ఎన్‌‌‌‌‌‌‌‌ కథై పాట చూపించి ‘నేను ర్యాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాన’ని చెప్పింది రుబిని. దానికి వాళ్లు ఒప్పుకోలేదు. ‘అది మన కల్చర్​ కాదు. కట్టుబొట్టు వేరేలాగ ఉంటుంద’ని వద్దన్నారు. అందుకే రుబిని చీర కట్టు, బొట్టు, జడలో పూలు పెట్టుకొని ట్రెడిషనల్‌‌‌‌‌‌‌‌గా రెడీ అయి పాటలు పాడుతోంది. అంతేకాదు ఇప్పుడు ఈ చీర కట్టుతోనే తనకంటూ సొసైటీలో స్పెషల్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు వచ్చింది. 2019లో గోపీనాథ్‌‌‌‌‌‌‌‌ను పెండ్లి చేసుకుంది.  వీళ్లిద్దరూ కలిసి ‘యోన్‌‌‌‌‌‌‌‌ సొల్లాసై కెట్కా.... అనే ర్యాప్‌‌‌‌‌‌‌‌ పాడారు. ఈవెంట్లు, స్టేజ్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌ కూడా ఇస్తుంటారు. బేతేల్‌‌‌‌‌‌‌‌ నగర్ ప్రజలకు సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇస్తూ పాడిన ‘# బేతేల్‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పాటతో వీళ్లకు మంచి పేరు వచ్చింది. 

‘ఏం చేస్తానన్నా వద్దు, నీకెందుకు అంటుంటారు. ఆడవాళ్లు ఇదే చేయాలి, ఇలానే ఉండాలంటూ అడ్డుపడుతుంటారు. అలా అనేవాళ్లకు నేను వ్యతిరేకిని. ఎందుకంటే ఇది చేయి, అది వద్దు అంటూ ఆడవాళ్లను ఆపే హక్కు ఎవ్వరికీ లేదు. నేను పాడే పాటలన్నీ చాలావరకు ఆడవాళ్ల కలల గురించే పాడా. అందుకే చాలామంది నన్ను ఫెమినిస్ట్‌‌‌‌‌‌‌‌ అంటుంటారు’ అని చెప్పింది రుబిని.