ఎల్జేపీ ఎంపీ ప్రిన్స్​రాజ్​పై రేప్​ కేసు

V6 Velugu Posted on Sep 15, 2021

న్యూఢిల్లీ: లోక్​జనశక్తి పార్టీ ఎంపీ, చిరాగ్​ పాశ్వాన్​సోదరుడు ప్రిన్స్​రాజ్ పై రేప్ ​కేసు బుక్​ అయింది. కోర్టు ఆదేశాలతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేస్​నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ప్రిన్స్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ మూడు నెలల కిందట ఓ మహిళ ఢిల్లీలోని కన్నాట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రిన్స్​రాజ్ పై పోలీసులు చర్యలు తీసుకోకుండా చిరాగ్‌‌‌‌‌‌‌‌ అడ్డుపడుతున్నారని, తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకుని, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు ప్రిన్స్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌, చిరాగ్‌‌‌‌‌‌‌‌పై కేసు ఫైల్​చేశారు.
పార్టీ మహిళా కార్యకర్త..
బాధిత మహిళ ఎల్‌‌‌‌‌‌‌‌జేపీ కార్యకర్త.. పార్టీ ఆఫీసుకు తరచూ వస్తుంటారు. ‘ప్రిన్స్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ను చాలాసార్లు కలిశా. ఆయన ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు వెళ్లినప్పుడు తాగడానికి ఏదో ఇచ్చారు. అది తాగి స్పృహ కోల్పోయిన నాపై ఆయన లైంగిక దాడికి పాల్పడ్డారు’ అని చెప్పారు.

Tagged rape case, , LJP MP Prince Raj

Latest Videos

Subscribe Now

More News