చాక్లెట్ల ఆశ చూపి.. ఇద్దరు బాలికలపై అత్యాచారం

V6 Velugu Posted on Oct 08, 2021

  • నిజామాబాద్​ జిల్లాలో దారుణం
  • పోలీసుల అదుపులో నిందితుడు

నిజామాబాద్, వెలుగు: ఇద్దరు బాలికలకు చాక్లెట్ల ఆశ చూపిన ఓ వ్యక్తి వారిపై నెల రోజులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన నిజామాబాద్​జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్​నగర శివారు కాలనీలో  మేస్త్రీగా పని చేస్తున్న వసీం(30) అనే వ్యక్తి ఇద్దరు(8 ఏండ్లు, 11 ఏండ్లు) బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి, వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా నెల రోజులుగా వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.  ఇంట్లో తెలియడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్ట్​ చేశారు. 

Tagged Rape, Nizamabad District, girls,

Latest Videos

Subscribe Now

More News