ఒక్కసారిగా తగ్గిన బంతిపూల రేటు: రాకముందు 35.. వచ్చినంక రూ.2

ఒక్కసారిగా తగ్గిన బంతిపూల రేటు: రాకముందు 35.. వచ్చినంక రూ.2

తూప్రాన్, వెలుగు: బంతిపూలకు తగిన రేటు లేకపోవడంతో రైతులు రోడ్డు పక్కన పారబోశారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్​విధించారు. దీంతో మాలేగావ్​కు చెందిన ఆరుగురు రైతులు హైదరాబాద్​లో అమ్మేందుకు రెండు వెహికల్స్​లో 4 టన్నుల బంతి పూలను తీసుకొచ్చారు. ఇక్కడకు  వచ్చేముందు కిలో రూ. 35 చొప్పున కొనేలా వ్యాపారితో మాట్లాడుకున్నారు. తీరా హైదరాబాద్ వచ్చాక వ్యాపారి ధర లేదని కిలోకు రూ. 2 మాత్రమే ఇస్తానని అన్నాడు. కనీసం కిలోకు రూ. 10 ఇవ్వాలని, అలాగైతే తమ ఖర్చుల వరకైనా వస్తాయని రైతులు బతిమలాడారు. కిలోకు రూ. 2 కంటే ఎక్కువ ఇవ్వమని వ్యాపారులు తేల్చిచెప్పడంతో గురువారం ఉదయం తూప్రాన్ మీదుగా మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో తూప్రాన్ దగ్గర రోడ్డు పక్కన ఈ బంతి పూలను పారబోశారు. హైదరాబాద్ లో పూల వ్యాపారం బాగుందని చెప్తే ఇక్కడకు తెచ్చామని, రేటు ఇవ్వకుండా మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన పారబోసిన పూలను కొందరు స్థానికులు సంచుల్లో తీసుకెళ్లారు.