
న్యూఢిల్లీ: తప్పుడు ప్రకటనలు, అన్యాయమైన వ్యాపార పద్ధతులను పాటించినందుకు రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడోకు రూ. 10 లక్షల జరిమానా విధించినట్లు వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) తెలిపింది.
'5 నిమిషాల్లో ఆటో లేదా రూ. 50' వంటి ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని సీసీపీఏ గుర్తించింది. హామీ ఇచ్చిన డబ్బును ఇవ్వని కస్టమర్లకు తిరిగి చెల్లించాలని కూడా రాపిడోను ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.