
ఎల్బీనగర్లో ఆటో చోరీ యత్నం... నాగోల్‌లో మద్యం కొనుగోలు
ఉప్పల్‌లో వైన్‌షాపు వద్ద ఎర్ర తువాల.. ప్లాస్టిక్ కవర్ స్వాధీనం
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి నుంచి స్పెషల్ ఆపరేషన్
1,500 సీసీ కెమెరా ఫుటేజీలను చెక్ చేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: రేపిస్ట్ రాజు పోలీసులకు చిక్కకుండా గెటప్మారుస్తూ.. తిరుగుతున్నాడు. మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్క్యారీబ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకొని సైదాబాద్సింగరేణి కాలనీలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు.. ఎల్బీనగర్వెళ్లే సరికి తలపై క్యాప్, జుట్టుకు ఉన్న రబ్బర్బ్యాండ్తీసేసి గెటప్మార్చేశాడు. అక్కడి నుంచి ఉప్పల్రింగ్రోడ్డు సమీపంలో ఓ వైన్షాప్వద్ద చేతిలో ఉన్న ప్లాస్టిక్కవర్, మెడలో తువాల కూడా వదిలేశాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిందితుడు గెటప్మారిస్తే ఎలా ఉంటాడనే ఉహా చిత్రాలు రిలీజ్చేశారు. తలపై వెంట్రుకలు, గడ్డం తీసేస్తే ఉండే ఆకారాన్ని పోస్టర్లలో ప్రచురించి బస్టాండ్స్, మార్కెట్స్, వైన్స్, టెంపుల్స్ వద్ద అతికిస్తున్నారు. రాజు చేతిలోని కవర్ అందులో దొరికిన కల్లు బాటిల్‌ను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్మార్గంపై నిఘా..
దాదాపు1500 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌పరిశీలించిన తర్వాత రాజు గురువారం సైదాబాద్సింగరేణి కాలనీ నుంచి శుక్రవారం నాటికి ఉప్పల్రింగ్రోడ్డుచేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు వరంగల్మార్గంలో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. వరంగల్ హైవే లోని వైన్స్, హోటల్స్, ఇసుక లారీల అడ్డాలు, టెంపుల్స్‌లో గాలించారు. ఘట్కెసర్, యాదాద్రి భువనగిరి మార్గల్లో సీసీటీవీ ఫుటేజీ చెక్‌చేస్తున్నారు. మరోవైపు రాజు సొంతూరైన అడ్డగూడురులో పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్,స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో స్పెషల్ఆపరేషన్చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులు అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు.
సీసీటీవీ ఫుటేజీ.. రేపిస్ట్ కదలికలు
ఈ నెల 9(గురువారం)న చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన రాజు.. అదే రోజు రాత్రి ఇంటికి తాళం వేసి మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్క్యారీ బ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకొని సైదాబాద్సింగరేణి కాలనీ నుంచి బయలుదేరాడు. ఈ నెల 10(శుక్రవారం)న వినాయక చవితి రోజు కాలినడకన ఎల్బీనగర్చేరుకున్నాడు. ఎల్బీనగర్ టు ఉప్పల్రింగ్రోడ్డు మార్గంలో ఓ చిన్న ఆటోను చోరీ చేసే ప్రయత్నం చేశాడు. ఆటో డ్రైవర్అలర్ట్కావడంతో అప్పుడే అటువైపు వెళ్తున్న బస్సు ఎక్కాడు. నాగోల్‌లో దిగిన రాజు అక్కడ ఓ వైన్‌షాపులో మందు కొని తాగాడు. దాదాపు ఓ గంట పాటు అక్కడే తిరిగాడు. అక్కడి నుంచి ఉప్పల్రింగ్రోడ్డు వరకు చేరుకున్నాడు. అదే రోజు ఉప్పల్రింగ్రోడ్డు నుంచి వరంగల్మార్గంలో ఓ వైన్షాప్వద్ద తిరిగాడు. చేతిలో ఉన్న కవర్, మెడపై ఉన్న ఎర్ర తువాల వైన్షాప్పక్కన పడేశాడు. కవర్లో ఓ మద్యం సీసా(కల్లుబాటిల్) ఉంది. నిందితుడు చివరగా ఈ నెల10వ తేదీన 7.45 నిమిషాలకు ఉప్పల్రింగ్రోడ్డు వద్ద తిరిగాడు. అక్కడి నుంచి ఎటు వెళ్లాడనేదానిపై పోలీసులు గాలిస్తున్నారు.