
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన ఆర్సీబీ జెర్సీ వేసుకుని జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ కనిపించడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. తన కొడుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పటికీ ఆర్సీబీ జెర్సీ వేసుకోవడం వైరల్ గా మారుతుంది. అయితే నితీష్ కుమార్ రెడ్డితో పాటు వారి కుటుంబం మొత్తం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి పెద్ద అభిమానులు. నితీష్ కుమార్ ఐపీఎల్ లో రాకముందు ఫ్యామిలీ అందరూ కలిసి ఆర్సీబీకి సపోర్ట్ చేసేవారట.
ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి విరాట్ కోహ్లికి ఎంత పెద్ద అభిమానో చాల సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. నితీష్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టకముందే కోహ్లి లైవ్‌లో చూసేందుకు నితీష్ రెడ్డి బాగా ఆసక్తి చూపించేవాడు. తన టెస్ట్ అరంగేట్రం బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో జరిగింది. డెబ్యూ మ్యాచ్ ఆడే సమయంలో కూడా కోహ్లి చేతుల మీదుగానే టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. గత సీజన్ లో సన్ రైజర్స్ తరపున అదరగొట్టిన నితీష్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన నితీశ్ 21.17 సగటు 113.43 స్ట్రైక్‌రేటుతో 152 పరుగులు మాత్రమే సాధించాడు.
Also Read : ఇండియాలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్
ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా ఆడుతుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 మ్యాటిక్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు సన్ రైజర్స్ ఆడిన 9 మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ లో మాత్రమే గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శుక్రవారం ( మే 2) సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. డూ ఆర్ డై మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తుంది.
Nitish Kumar Reddy's father in RCB jersey during his gym session. 😄 pic.twitter.com/SaKiH5GDdv
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2025