ఇండియాలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్.. బాబర్, రిజ్వాన్‌తో పాటు మరో ముగ్గురు

ఇండియాలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్.. బాబర్, రిజ్వాన్‌తో పాటు మరో ముగ్గురు

భారత ప్రభుత్వం పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లపై ఝలక్ ఇచ్చింది. టాప్ ప్లేయర్స్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ ను బ్లాక్ చేసింది. హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, ఇమామ్-ఉల్-హక్ తో పాటు అనేక మంది పాకిస్తాన్ ఆటగాళ్ల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను ఇండియాలో బ్లాక్ చేయబడ్డాయి. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది.

ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం డిజిటల్ కంటెంట్‌పై, ముఖ్యంగా పాకిస్తానీ జాతీయులను లక్ష్యంగా చేసుకుని ఈ  కఠిన చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ క్రికెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఫరీద్ ఖాన్ యొక్క X ఖాతాను ఇటీవల భారతదేశంలో బ్లాక్ చేశారు. ఇండియాలో అనేక స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించారు. ఈ నిషేధించబడిన స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తన్వీర్ అహ్మద్, షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది, రషీద్ లతీఫ్, బాసిత్ అలీ ఖాతాలు కూడా ఉన్నాయి.  ఈ లిస్ట్ లో బిబిఎన్ స్పోర్ట్స్, సమా స్పోర్ట్స్ కూడా ఉన్నాయి.

Also Read : ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిపిస్తా

కొన్ని రోజుల క్రితం ఇండియాలో పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది.  భారత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్ గురువారం (ఏప్రిల్ 24) ఇండియాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ప్రసారాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 11 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. మే 18 వరకు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 31 మ్యాచ్ లు జరగనున్నాయి. రావల్పిండి క్వాలిఫైయర్ 1తో సహా టోర్నమెంట్‌లోని 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

ఉగ్రవాదుల నరమేధం తర్వాత.. బీసీసీఐ ఇకపై పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ లు ఆడేది లేదని స్పష్టం చేసింది. తటస్థ వేదికలపైన కూడా పాక్ తో మ్యాచ్ లు ఆడేది లేదని.. ఇది ఫైనల్ అని తేల్చి చెప్పింది బీసీసీఐ. దీని ప్రకారం భారత్, పాకిస్థాన్ జట్లు ఇకపై కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలబడనున్నాయి. ఐసీసీ ఈవెంట్స్ లో కూడా రెండు జట్లు ఒక గ్రూప్ లో ఉండేందుకు వీలు లేదని ఐసీసీ తేల్చి చెప్పింది.