జగిత్యాలలో 20లక్షల విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ

జగిత్యాలలో 20లక్షల విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ

పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన సెల్ ఫోన్లను రికవరీ చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు.CEIR వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకున్న వినియోగదారుల మొబైల్ ఫోన్లు పట్టుకొని వారికి అప్పగించారు. శుక్రవారం (మే 2) జగిత్యాల జిల్లా పరిధిలో మిస్సైన లేదా దొంగిలించబడిన లక్షల విలువైన మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ బాధితులకు అందించారు.

ఇటీవల కాలంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బాధితులు పొగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొత్తం రూ.20లక్షల విలువైన102 మొబైల్ ఫోన్లను జిల్లా కార్యాలయంలో బాధితులకు ఎస్పీ అశోక్ కుమార్ అందజేశారు. 

మొబైల్ ఫోన్లు మిస్ అయినా లేదా దొంగిలించబడిన వెంటనే కంప్లయింట్ చేయకుండా ఉంటే అది సామాజిక, వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవాలంటే CEIR వెబ్ సైట్ ఎంతో ఉపగయోగపడుతుందన్నారు.బాధితులు ఈ పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుంటే సులభంగా పట్టుకొని ఆస్కారం ఉంటుందన్నారు. 

Also  Read : బాబోయ్ఎండలు..రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు

చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీకి ప్రతేకంగా RSI, హెడ్ కానిస్టేబుల్, మరో ఇద్దరు కానిస్టేబుళ్ల తో కూడిన స్పెషల్ టీంను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 986 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని అన్నారు.


CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గానీ,  ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.