ఇదేం విచిత్రం.. వెదర్ మ్యాప్ చూస్తే షాక్ : ఏపీ, తెలంగాణను టచ్ చేయకుండా వెళ్లిన వర్ష మేఘాలు

ఇదేం విచిత్రం.. వెదర్ మ్యాప్ చూస్తే షాక్ : ఏపీ, తెలంగాణను టచ్ చేయకుండా వెళ్లిన వర్ష మేఘాలు

ఉత్తర భారతదేశం మొత్తం వరదలు పోటెత్తాయి. ఇటు తమిళనాడు పడుతున్నాయి.. అటు ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశం, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ తోపాటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తం వర్షాలు, వరదలతో బీభత్సంగా ఉంది. రుతు పవనాల విస్తరణ, వర్ష మేఘాలు విస్తరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. 

తమిళనాడు మీదుగా విస్తరించిన వర్ష మేఘాలు.. ఏపీ, తెలంగాణకు దూరంగా వెళ్లి.. మళ్లీ ఒడిశాలో ఎంట్రీ అయ్యి.. ఉత్తర భారతం వెళ్లాయి. ఇదే ఇప్పుడు ఆసక్తి రేపుతుంది.. వాతావరణ శాఖ అధికారులను సైతం విస్మయానికి గురి చేస్తుంది. రెగ్యులర్ గా అయితే.. తమిళనాడు నుంచి ఏపీ, తెలంగాణ మీదుగా వెళుతూ.. తెలంగాణను టచ్ చేస్తూ వెళ్లాల్సిన వర్ష మేఘాలు.. ఏపీకి దూరంగా వెళ్లిపోవటంతో తెలంగాణలోనూ వర్షాభావ పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఉత్తరాదిలో 20 సంవత్సరాల రికార్డులను బ్రేక్ చేస్తూ.. వర్షాలు పడుతుంటే.. ఏపీ, తెలంగాణలో మాత్రం కనీస వర్షపాతం లేకపోవటం ఆందోళన కలిగిస్తుంది. 

పైన ఉన్న ఫొటో చూస్తే ఇదే స్పష్టం అవుతుంది. వాస్తవంగా అయితే కేరళలోకి ఎంట్రీ ఇచ్చిన రుతు పవనాలు.. కేరళ నుంచి కర్నాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణ మీదుగా ఉత్తర భారతదేశానికి వెళతాయి. సరిగ్గా రుతు పవనాలు ఏపీలోకి వచ్చే సమయంలోనే గుజరాత్ తుఫాన్ వల్ల వేగం తగ్గి.. తేమ గాలులన్నీ అటు వైపు వెళ్లిపోయాయి. తుఫాన్ తర్వాత  వాతావరణం చల్లబడినా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడలేదు. కనీసం వర్ష మేఘాలు సైతం ఏర్పడకపోవటంతో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు మాత్రమే పడుతున్నాయి. జులై 10వ తేదీ వచ్చినా వర్షాల జాడ లేకపోగా.. ఉత్తరాదిలో మాత్రం కుంభవృష్టి, అతి వృష్టి ఏర్పడింది. 

కేవలం ఏపీ, తెలంగాణ తెలుగు రాష్ట్రాలను టచ్ చేయకుండా.. దూరంగా వర్ష మేఘాలు వెళ్లిపోవటం వెదర్ మ్యాప్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఎందుకొచ్చింది.. కారణాలు ఏంటీ అనేది ఇప్పుడు వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మ్యాప్ ఇప్పుడు చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు దూరం మేఘావృతం ఉండటం.. ఆ తర్వాత మళ్లీ ఒడిశా నుంచి లోపలికి రావటం అనేది విచిత్రంగా అనిపిస్తుంది.