హైదరాబాద్లో రేరిజం స్టోర్ షురూ

హైదరాబాద్లో రేరిజం స్టోర్ షురూ

హైదరాబాద్, వెలుగు:  మహిళల ఫ్యాషన్ బ్రాండ్ అయిన రేరిజం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన మూడో ఔట్​లెట్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. లాంచ్ వేడుకకు ప్రముఖ నటి శ్రీలీల వచ్చారు. దీంతో కలుపుకుంటే   మొత్తం స్టోర్ కౌంట్ 30కి చేరుకుంది. కొత్త స్టోర్​ను 650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.  కదిలే స్తంభాలతో ఇది ఆధునిక ప్యాలెస్‌‌‌‌‌‌‌‌ను గుర్తుకు తెస్తుంది.  ఈ బ్రాండ్ రాధామణి టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్  అనుబంధ సంస్థ. రేరిజమ్‌‌‌‌‌‌‌‌ను 2016లో అక్షికా పొద్దార్ స్థాపించారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన ఉనికిని విస్తరించడానికి బ్రాండ్ ఉత్సాహంగా ఉందని ఆమె చెప్పారు.