
సౌత్ ఇండస్ట్రీలో సైలెంట్‌గా పాగా వేస్తోంది రాశీ ఖన్నా. తమిళనాట వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తాజాగా ఈ పాల బుగ్గల సుందరి మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతారను రాశీ రీప్లేస్ చేసింది. కోలీవుడ్‌లో వైనాత్ శశికాంత్ దర్శకత్వంలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కనుంది.
సిద్ధార్థ్, మాధవ్ ఇందులో లీడ్ రోల్ చేస్తున్నారు. నయనతార ప్రధాన పాత్రలో నటించాల్సి ఉంది. అయితే, కొన్ని కారణాల వల్ల నయన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అయితే, ఈ స్టార్ హీరోయిన్ ప్లేస్‌లో రాశీ బెస్ట్ చాయిస్ అని మూవీ మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావలసి ఉంది.
ఇటీవల కార్తీ ‘సర్దార్‘ సినిమాలో మెరిసిన రాశీ.. ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ తోనూ ఆకట్టుకుంది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి నటించిన ఈ సిరీస్‌లో మేఘా వ్యాస్ అనే ఆర్బీఐ అధికారిగా రాశీ మెప్పించింది.