
న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో ఇండియా యంగ్ షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. రష్మిక సెహగల్– - కపిల్ జోడీ గోల్డ్ అందుకుంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఈ ద్వయం 16–-10తో ఇండియాకే చెందిన వంశిక చౌదరి–అంథోనీ జొనాథన్ గవిన్ జోడీపై విజయం సాధించింది. విమెన్స్ స్కీట్ ఫైనల్లో రైజా థిల్లాన్ 51 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచి సిల్వర్ అందుకుంది. ఇండియాకే చెందిన మాన్సి రఘువంశీ 41 పాయింట్లతో కాంస్యం నెగ్గింది.