
‘పుష్ప’ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయింది రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ గుడ్ బై, సిద్ధార్థ్ మల్హోత్ర మిషన్ మజ్నూ సినిమాలతో బీటౌన్ లో అరంగేట్రం చేస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రణ్‌బీర్ కపూర్ కాంబోలో వస్తోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘యానిమల్’ లోనూ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ షెరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది. విక్కీ కౌశల్ ‘చావా’ అనే చారిత్రక సినిమాలో మహారాణి పాత్రలో కనిపించనుందట రష్మిక. ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు ఛత్రపతి సంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సంభాజీ భార్య పాత్రలో రష్మిక నటించనుంది.
ప్రస్తుతం పుష్ప–2 సినిమాతో ఈ బ్యూటీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ బ్యూటీ.. నితిన్ హీరోగా వస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా కి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ కాంబోలో వచ్చిన "భీష్మ" మూవీ సూపర్ హిట్ అయ్యింది అందుకే ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.