టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. లేటెస్ట్ గా రష్మిక తన ప్రాణ స్నేహితులతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంచుకుంది. ఇది కేవలం గర్ల్స్ ట్రిప్ మాత్రమే కాదు, రష్మిక 'బ్యాచిలొరెట్ పార్టీ' అని అభిమానులు, నెటిజన్లు ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
శ్రీలంకలో బ్యాచిలర్ పార్టీ..
రష్మిక తన బిజీ షెడ్యూల్ నుండి కేవలం రెండు రోజులు విరామం తీసుకుని, తన ప్రాణ స్నేహితులతో కలిసి శ్రీలంకలోని ఒక అందమైన రిసార్ట్‌కు వెళ్ళింది. ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రష్మిక చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. "నాకు దొరికిన 2 రోజుల విరామంలో నా గర్ల్స్ గ్యాంగ్ తో కలిసి శ్రీలంకలోని ఒక అద్భుతమైన ప్రాపర్టీకి వెళ్లాను. గర్ల్స్ ట్రిప్స్ అనేవి ఎంత చిన్నవైనా సరే.. అవి ఎప్పుడూ 'ది బెస్ట్' గానే ఉంటాయి. నా స్నేహితులు అందరికంటే బేస్ట్.. కొందరు స్నేహితులు మిస్ అయ్యారు కానీ, ఉన్న వారితో గడిపిన ఈ సమయం చాలా ప్రత్యేకం అని రష్మిక పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలలో రష్మిక సమ్మర్ డ్రెస్‌లు, మెరిసే పార్టీ వేర్‌లలో చాలా సంతోషంగా కనిపిస్తోంది. సూర్యాస్తమయం, సముద్రపు అలలు, కొబ్బరి నీళ్లు.. ఇలా ప్రకృతి ఒడిలో ఆమె గడిపిన తీరు చూస్తుంటే, ఇది కేవలం విహారయాత్ర కాదు, పెళ్లికి ముందు స్నేహితులతో జరుపుకున్న 'బ్యాచిలొరెట్ పార్టీ' అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.
ALSO READ : శిల్పా శెట్టి & రాజ్ కుంద్రాపై 420 కేసు..
ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వెడ్డింగ్?
విజయ్ - రష్మిక వివాహం 2026, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరగనుందని సినీ వర్గాలు టాక్ వినిపిస్తోంది . ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తయ్యాయని, అక్టోబర్‌లోనే వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగింది . వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచినప్పటికీ.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ప్రమోషన్స్‌లో విజయ్ తనకు అందించిన సపోర్ట్ గురించి రష్మిక ప్రస్తావిస్తూ ఒక చిన్న హింట్ కూడా ఇచ్చేసింది.
బాక్సాఫీస్ వద్ద రష్మిక హవా..
వృత్తిపరంగా చూస్తే రష్మికకు 2025 ఒక గోల్డెన్ ఇయర్ చెప్పుకోవచ్చు. వరుస విజయాలతో ఆమె పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. హిస్టారికల్ మూవీ 'చావా'లో రష్మిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన హారర్ కామెడీ చిత్రం 'తమ్మ' (Thammaa) బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా 'ది గర్ల్‌ఫ్రెండ్' , 'కుబేర' ఈ చిత్రాలు రష్మిక క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సల్మాన్ ఖాన్ సరసన నటించిన 'సికందర్' ఆశించిన విజయం సాధించకపోయినా, ఆమెకున్న స్టార్‌డమ్ ఏమాత్రం తగ్గలేదు.
గీత గోవిందం నుంచి...
2018లో వచ్చిన 'గీత గోవిందం' సెట్స్‌లో మొదలైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పరిచయం.. 'డియర్ కామ్రేడ్' నాటికి బలమైన బంధంగా మారింది. గతంలో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన తర్వాత, రష్మిక తన కెరీర్‌పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు విజయ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారనే వార్త సినీ ప్రియులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. త్వరలోనే ఈ జంట తమ పెళ్లిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
