
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వాక్ స్వతంత్రం బాగా పెరిగిపోయింది. ఎవరు.. ఎవరిపైననా.. ఎలాంటి కామెంట్స్ అయినా చెయ్యొచ్చు అన్నట్టుగా మారిపోయింది. ఒకప్పుడు స్టార్స్ కి ఆడియన్స్ కు మధ్య కనెక్షన్ ఉండేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని డైరెక్టర్ ఆ వ్యక్తిని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. తాజాగా ఇదే సిచువేషన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) కు ఎదురైంది. ఆమె నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు(Adavallu Meeku Joharlu) సినిమాకు సంబంధించి ఓకే నెటిజన్ చేసిన కామెంట్స్ కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. యంగ్ హీరో శర్వానంద్, సెన్సిబుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా కథ తనకు నచ్చలేదని, కేవలం శర్వానంద్, దర్శకుడు కిషోర్ తిరుమల కోసమే ఆ సినిమా చేశానని రష్మిక అన్నట్టుగా రూమర్స్ క్రియేట్ చేశాడు ఓ నెటిజన్స్.
I didn’t like the Script of #AadaluMeekuJoharlu but I Signed the Film Only Because of #KishoreTirumala and #Sharwa - #RashmikaMandanna ??? pic.twitter.com/NR3HRDTfG6
— Govind (@Movies324) February 12, 2024
దానికి స్పందించిన రష్మీక మందన్నా ఆ నెటిజన్స్ పై మండిపడింది... ఎవరు చెప్పారు నీకు. కేవలం కథ బాగుంటేనే సినిమాలు చేస్తాను. ఆ తర్వాత వారితో నటించడం అనేది ఒక గౌరవంగా భావిస్తాను. దయచేసి ఇలాంటి నెగిటీవ్ రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ రాసుకొచ్చారు రేష్మిక మందన్న. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ మూవీ పుష్ప 2లో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.