
శ్రీవల్లిగా ప్యాన్ ఇండియా వైడ్‌గా ఫేమ్ తెచ్చుకున్న రష్మిక మందాన్న.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్‌గా ‘వారసుడు’ చిత్రంలో కనిపించిన ఆమె.. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘యానిమల్’ కంప్లీట్ చేసే పనిలో ఉంది. మరోవైపు ఆమెను ప్రతి ఒక్కరూ ‘పుష్ప2’ అప్‌డేట్‌ను అడుగుతుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడింది.
ఇప్పటికే షూటింగ్ మొదలైందన్న రష్మిక.. ఫిబ్రవరి నుంచి తాను సెట్స్‌లో జాయిన్ అవనున్నట్టు చెప్పింది. అంతేకాదు సెకెండ్ పార్ట్ కోసం అందరిలాగే తాను కూడా వెయిట్ చేస్తున్నానంది. ‘పుష్ప’లో డీ గ్లామరస్‌గా కనిపించిన రష్మిక.. తనదైన నటనతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే రాబట్టింది. బన్నీ, రష్మిక కాంబోలో వచ్చిన ‘సామీ సామీ’ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. వీళ్లిద్దరి పెళ్లితో ఫస్ట్ పార్ట్‌కి ఎండింగ్ ఇచ్చిన సుకుమార్.. సీక్వెల్‌లో ఈ జంటను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది.