
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇటీవలే యానిమల్(Animal) సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె ప్రస్తుతం పుష్ప 2(Pushpa 2) సినిమాలో చేస్తున్నారు. ఇదే కాకుండా.. మరో నాలుగు ప్రెస్టిజియస్ సినిమాలు చేస్తున్నారు రష్మిక. అందులో ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend) సినిమా ఒకటి.
లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమాను నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తుండగా.. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. అయితే.. చాలా కాలం క్రితమే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడంలేదు మేకర్స్. దీంతో రష్మిక ఫ్యాన్స్ ఒకరు ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ అప్డేట్స్ కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు రిక్వెస్ట్ పెట్టాడట.
ఆ ఫ్యాన్ రిక్వెస్ట్ కు స్పందిస్తూ.. రష్మిక మందన్నా నటిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ టీజర్ ను ఆమె పుట్టినరోజు ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా వచ్చిన ఈ అప్డేట్ తో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీ రోల్ చేస్తుండగా.. లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక చాలా ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆమెకు ఇలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.