హైదరాబాద్, వెలుగు: గోవా నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ టెన్నిస్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక, శ్రావ్య శివాని విమెన్స్ డబుల్స్‌లో సిల్వర్ గెలిచారు. శనివారం జరిగిన ఫైనల్లో ఈ ఇద్దరూ 3–6, 1–6తో టాప్ సీడ్ రుతుజా–ప్రార్థన (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయారు. విమెన్స్ సింగిల్స్‌లో రష్మిక ఫైనల్ చేరుకొని మరో పతకం ఖాయం చేసుకుంది.
