
నేషనల్ క్రష్ రష్మిక మందనా(Rashmika mandana) తన మేనేజర్ చేతిలో దారుణంగా మోసపోయిందట. రష్మిక మేనేజర్ ఆమెకు తెలియకుండా దాదాపుగా 80 లక్షలు దొంగలించాడట. ఈ విషయాన్ని తెలుసుకున్న రష్మిక వెంటనే తన మేనేజర్ ని ఉద్యోగం నుండి తీసేసిందనే వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఆ వ్యక్తి చాలా కాలంగా రష్మిక దగ్గరే పని చేస్తున్నాడట. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండటంతో.. ఈ వార్తలపై ఇప్పటివరకు మౌనంగానే ఉందట రష్మిక. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప 2(Pushpa2) సినిమాలో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్(Ranbir kapur) హీరోగా వస్తున్న యానిమల్(Animal) సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.