కొత్త స్టార్టప్ కు పచ్చ జెండా ఊపిన రతన్ టాటా

కొత్త స్టార్టప్ కు పచ్చ జెండా ఊపిన రతన్ టాటా

మానవీయతకు నిదర్శనంగా నిలిచే  ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా.. సీనియర్ సిటిజన్స్ కోసం ఓ కొత్త స్టార్టప్ సంస్థను ప్రారంభించారు. ఒంటరిగా జీవిస్తూ., ఎవరికీ ఏమీ కామన్న ఆలోచనతో కాలం వెల్లదీస్తున్న వారి కోసం ఇప్పటికే 'గుడ్ ఫెలోస్' అనే పేరుతో ప్రారంభమైన స్టార్టప్ సంస్థతో కలిసి తామూ పని చేస్తామని రతన్ టాటా ప్రకటించారు. ఇది ప్రస్తుతం ముంబయిలో అందుబాటులో ఉండగా... కొని దఫాలుగా పుణే, చెన్నై, బెంగళూరులోనూ సేవలు ప్రారంభిస్తామని రతన్ టాటా తెలిపారు.

పైలట్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం వృద్ధులకు సపర్యలు చేయడం, వారు తమ శేష జీవితంలో ఆనందంగా గడిపేలా చూడడం. అందులో భాగంగా వృద్ధుల కోసం పని చేసే యువకుల్ని సేవల నిమిత్తం అపాయింట్ చేసుకుంటారు. వారితో ఆడుతూ, పాడుతూ మెరుగైన సేవలందించడమే కాకుండా... వారితో కొన్ని ఇండోర్స్ గేమ్స్ కూడా ఆడించడమే ఈ యువకుల పని. అయితే ఈ స్టార్టప్ కోసం రతన్ టాటా పెద్దమొత్తంలోనే పెట్టుబడులు పెడుతున్నారట. అది ఎంత అనేది మాత్రం సస్పెన్స్. అంతే కాదు వీధికుక్కల పట్ల కూడా రతన్ టాటా ఎంతో శ్రద్ధ చూపిస్తారు. తాజాగా ఆసరా లేని వృద్ధుల కోసం ఓ కొత్త స్టార్టప్ ను ప్రకటించారు.

గుడ్ ఫెలోస్ ను శంతను నాయుడు ప్రారంభించారు. శంతనునాయుడు టాటా ఆఫీసులో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. 2018 నుంచి శంతనునాయుడు.. రతన్ కు సహాయకుడిగా ఉన్నారు.  కాగా రతన్ తనలాగే ఒంటరి వృద్ధుల ఆనందం కోసం ఏదైనా చేయాలనే తలంపుతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇక ఈ గుడ్ ఫెలోస్ పనితీరు గురించి పూర్తిగా తెలియాలంటే ఇంకొద్ది కాలం వేచి ఉండాల్సిందేనని నిపుణులు అంటున్నారు.