దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. అతను ఓ కుర్రాడిని దత్తత తీసుకున్నాడు. అతనే రతన్ జీకి దగ్గరుండి సపర్యలు చేసేవాడు. వృద్ధాప్యంలో ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే రతన్ టాటాకు ఆ అబ్బాయి చేతికర్రలా ఉండేవాడు. పెళ్లి, పిల్లలు లేని ఆయనకు ఆ కుర్రాడు కొడుకులా సేవలు చేశాడు. ఆలోచన విధానంలో రతన్ టాటా, ఆ కుర్రోడు సేమ్ టూ సేమ్ ఉంటారు. వారిద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. ఆ కుర్రాడి పేరే శాంతను నాయుడు. రతన్ టాటా అతన్ని పర్సనల్ అసిస్టెంట్ మరియు బిజినెస్ జనరల్ మేనేజర్ గా నియమించుకున్నాడు.
అబ్బాయికి ప్రస్తుతం 29ఏళ్లు. 2022 మే నుంచి శాంతను రతన్ టాటా దగ్గర పని చేయడం ప్రారంభించాడు. శంతనుకి సొంతంగా గుడ్‌ఫెలోస్ అనే పేరుతో బిజినెస్ కూడా ఉంది. అతని కంపెనీ నికర విలువ రూ.5 కోట్లు. ఇది సీనియర్ సిటిజన్‌లకు వృద్ధాప్యంలో సేవలను అందించే స్టార్టప్. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నప్పుడు వైరల్ అయిన వీడియోతో ఫస్ట్ టైం శాంతను గురించి చాలామందికి తెలిసింది.
Also Read :- రతన్ టాటా.. ప్రేమకథ ఇదే..
ఓ ఎన్జీఓ ద్వారా వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్నప్పుడు శాంతను రతన్ టాటా దృష్టిలో పడ్డాడు. అతనిని తన జనరల్ మేనేజర్‌గా నియమించుకున్నాడు. అంతే కాదు వీధి కుక్కల సంరక్షణ కోసం శాంతను చేస్తున్న ప్రాజెక్ట్‌లో రతన్ టాటా పెట్టుబడి కూడా పెట్టాడు. పూణేలో పుట్టి పెరిగిన శాంతను సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీని పట్టా పొందాడు. కార్నెల్ జాన్సన్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి MBA చదివారు. శాంతను టాటా ఎల్క్సీలో ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్‌గా తన లైఫ్ ప్రారంభించాడు. రోడ్డు యాక్సిడెంట్స్ బారినుంచి వీధికుక్కలను రక్షించడానికి ఓ ప్రాజెక్ట్ చేశాడు. ఇందుకోసం డ్రైవర్ సులభంగా రోడ్డు పై వెళ్తున్న కుక్కను గుర్తించడానికి ఓ రిఫ్లెక్టెండ్ కాలర్ తయారు చేశారు. మూగజీవాలను రక్షించాలనే శాంతను తపనే రతన్ టాటాకు ఆ అబ్బాయిని దగ్గర చేసింది.