- జీఎస్టీ శ్లాబులపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
హైదరాబాద్, వెలుగు: జీఎస్టీని తీసుకురాకముందు పన్నుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జీఎస్టీ శ్లాబులు ఎక్కువున్నప్పుడు తగ్గించాలని చాలా రాష్ట్రాలూ డిమాండ్ చేశాయని చెప్పారు. ఆ తర్వాత రెండు శ్లాబులే చేస్తే.. ఇట్లెట్ల తగ్గిస్తరంటూ అవే రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయని విమర్శించారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. రూ.9 తేడా ఉందన్నారు. రాష్ట్రంలో జిల్లాల జీఎస్టీ అధికారులకు జీఎస్టీ చట్టంపై అవగాహన లేదని, వ్యాపారులను వేధిస్తున్నారని చెప్పారు.
