ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి పెయిన్‌‌‌‌ కిల్లర్ల రేట్లు పెరగనున్నాయి

ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి పెయిన్‌‌‌‌ కిల్లర్ల రేట్లు పెరగనున్నాయి

న్యూఢిల్లీ: పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌‌‌‌, యాంటీ ఇన్‌‌‌‌ఫెక్టివ్‌‌‌‌ వంటి అత్యవసరమైన మందుల ధరలు ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి కొద్దిగా పెరగనున్నాయి. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ఈఎం)  కింద ఉన్న మందుల రేట్లను  0.0055 శాతం పెంచుతున్నట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌‌‌‌పీపీఏ)  ప్రకటించింది.

హోల్‌‌‌‌ ప్రైస్ ఇండెక్స్‌‌‌‌ ఆధారంగా ఈ రేట్లను పెంచుతున్నట్టు తెలిపింది. ‘ ఆఫీస్‌‌‌‌ ఆఫ్ ఎకనామిక్‌‌‌‌ అడ్వైజర్, డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్‌‌‌‌ ట్రేడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్‌‌‌‌, ఇండస్ట్రీ  అందించిన హోల్‌‌‌‌సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా ఆధారంగా మందుల ధరలను 0.00551 శాతం పెంచుతున్నాం’ అని పేర్కొంది. అత్యవసర మందులు ధరలు కిందటేడాది 10 శాతం పెరగగా, అంతకు ముందు ఏడాది 12 శాతం పెరిగాయి. ఈసారి పెరిగిన రేట్లు ఫార్మా కంపెనీలకు పెద్ద ఊరటేం ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు. కీలకమైన మందులు అందుబాటు ధరల్లో ఉండేలా చేయడానికి ఎన్‌‌‌‌పీపీఏ 
పనిచేస్తోందన్నారు.