బిగ్ బాస్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన రతిక, శుభశ్రీ, దామిని.. ఇది నెక్స్ట్ లెవల్ ఉల్టా పుల్టా!

బిగ్ బాస్లోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన రతిక, శుభశ్రీ, దామిని.. ఇది నెక్స్ట్ లెవల్ ఉల్టా పుల్టా!

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) రోజురోజుకి రసవత్తరంగా మారుతోంది. వారం వారం ఊహించని ట్విస్టులతో ఆడియన్స్ కు, కంటెస్టెంట్స్ కు షాకుల మీద షాకులిస్తోంది. సీజన్ ముందు నుండి చెప్తున్నట్టుగానే ఉల్టా పుల్టా అనే పదానికి పర్ఫెక్ట్ న్యాయం చేస్తన్నారు మేకర్స్. గత వారం బిగ్ బాస్ 2.0 అంటూ మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పటి నుండి అసలైన ఉల్టా పుల్టా మొదలు అంటూ కంటెస్టెంట్స్ అండ్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేశారు. 

Also Read :- గాంజా శంకర్గా సుప్రీం హీరో

ఇక ఈ వారం కూడా అదే రేంజ్ మరో ట్విస్ట్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. తాజాగా రిలీజైన ప్రోమో చూసి ఆడియన్స్ తో పాటు కంటెస్టెంట్స్ కూడా అవాక్కాయ్యారు. కారణం.. హౌస్ నుండి ఎలిమినేట్ ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ మరోసారి బిగ్ బాస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగార్జున కూడా ఈ ముగ్గురిలో ఒకరు ఇంట్లో మల్లి ఎంట్రీ ఇవ్వనున్నారు అని చెప్పుకొచ్చాడు.. కానీ ఆ ఒక్క కంటెస్టెంట్ ఎవరు అనేది హౌస్ మేట్స్ డిసైడ్ చేయాలంటూ చెప్పుకొచ్చాడు. మరి ఇంటి సభ్యులు ఎవరిని మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఆహ్వానించారు అనేది తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. కానీ ఈ ప్రోమో మాత్రం ఆడియన్స్ లో ఆతృతను పెంచింది. ఇలా వారానికో ట్విస్ట్ ఇస్తూ మంచి టీఆర్ఫీ తో దూసుకుపోతోంది బిగ్ బాస్ సీజన్ 7.